దేవిశ్రీ ప్రసాద్ కు సవాల్ విసిరిన తమన్

Published on Nov 17,2019 10:29 AM

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు సవాల్ విసిరాడు మరో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్. అయితే ఈ సవాల్ నేరుగా చేసింది కాదు సుమా ! సూపర్ హిట్ పాటలతో మాత్రమే !  తాజాగా ఈ ఇద్దరూ సంగీతం అందిస్తున్న చిత్రాలు 2020 సంక్రాంతి కి విడుదల కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతం అందిస్తుండగా తమన్ మాత్రం అల్లు అర్జున్ నటిస్తున్న అల ..... వైకుంఠపురములో చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

తమన్ స్వరపరిచిన అల వైకుంఠపురములో చిత్రంలోని రెండు పాటలను విడుదల చేయగా అవి రెండు కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. సామజవరగమనా, రాములో రాములా పాటలు ఎంతటి సంచలనం సృష్టిస్తున్నాయో తెలిసిందే. అయితే సరిలేరు నీకెవ్వరు నుండి మాత్రం ఇంకా ఎలాంటి హడావుడి మొదలు కాలేదు దాంతో దేవిశ్రీ ప్రసాద్ తమన్ లాగా సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తాడా ? లేదా ? అన్న చర్చ సాగుతోంది.