టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ

Published on Nov 01,2019 01:46 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా సినిమా టికెట్ల ని అమ్మాడు. తమ అభిమాన హీరో టికెట్లు అమ్ముతుండటంతో ఒక్కసారిగా ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సంచలనం సంఘటన హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ థియేటర్ లో జరిగింది ఈరోజు. తరుణ్ భాస్కర్ , అనసూయ నటించిన మీకు మాత్రమే చెప్తా ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ఆ సందర్బంగా హీరో విజయ్ దేవరకొండ ఐమాక్స్ లో టికెట్లు అమ్మాడు కొద్దిసేపు.

దాంతో ప్రేక్షకులు ఎగబడ్డారు, తమ అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు పొందడం చాలా సంతోషంగా ఉందని సంబరపడిపోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ...... సరదాగా నవ్వుకునే సినిమా ఇదని తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ నిర్మించాడు అందుకే టికెట్లు అమ్మి క్రేజ్ తీసుకొస్తున్నాడు.