దేవరకొండ బ్రదర్స్ తో మల్టీస్టారర్

Published on Dec 09,2019 02:08 PM

విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ఈ ఇద్దరు అన్నాదమ్ముల కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారట. విజయ్ దేవరకొండ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది దాంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారట. ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని అనే చిత్రాన్ని చేసాడు. మంచి పేరు వచ్చింది కానీ దొరసాని చిత్రం హిట్ కాలేదు దాంతో ఆనంద్ కు కమర్షియల్ హిట్ కావాలి కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నారట.

ఆనంద్ దేవరకొండ తాజాగా ఓచిత్రం చేస్తున్నాడు అంతేనా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ముందు ఆనంద్ లుక్స్ తేలిపోయాయి దాంతో అన్నాదమ్ములను ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఇక ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే మాత్రం తప్పకుండా దేవరకొండ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.