రేణు దేశాయ్ కి డెంగీ జ్వరం

Published on Sep 16,2019 11:53 AM

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ డెంగీ బారిన పడింది. తానూ డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు స్వయంగా వెల్లడించింది రేణు దేశాయ్. అంతేకాదు చికిత్స తీసుకున్నానని , దాదాపుగా కోలుకున్నానని అయితే ఇంకా నీరసంగానే ఉందని పేర్కొంది. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్ ఫీవర్ , డెంగీ , మలేరియా , చికెన్ గున్యా లతో బాధపడుతున్నారు పలువురు.
దోమలకు సామాన్య ప్రజలు , సినీ , రాజకీయ ప్రముఖులు అనే తేడా ఏమి ఉండదు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని కొడుతున్నాయి దాంతో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చాక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న రేణు రెండో పెళ్ళికి సిద్ధమైంది.