వేదికపైనే ఏడ్చిన దీపికా పదుకొనే

Published on Dec 11,2019 01:55 PM

దీపికా పడుకొనే వేదికపైనే ఏడవడంతో అంతా షాక్ అయ్యారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన '' ఛపాక్ '' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జరిగింది. నిన్న ముంబైలో ఛపాక్ ట్రైలర్ వేడుక జరుగగా ఆ వేడుకలో హీరోయిన్ దీపికా పదుకొనె పాల్గొంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఈ '' ఛపాక్ ''. ఇక యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా నటిస్తోంది. ఆమె పై జరిగిన యాసిడ్ దాడిని విని చలించిపోయింది దీపికా దాంతో ఆమె కష్టాలు గుర్తుకు వచ్చి అందరి ముందే కన్నీళ్ల పర్యంతం అయ్యింది. దీపికా పదుకొనె ఏడుస్తుంటే ఆమెని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

ఇక ఛపాక్ ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తోంది. యాసిడ్ దాడి లో లక్ష్మీ అగర్వాల్ ముఖం చాలావరకు మారిపోయింది అయితే ఆమె అందాన్ని ఆ దుర్మార్గుడు నాశనం చేయొచ్చు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టలేడని చాటుతోంది లక్ష్మీ అగర్వాల్. ఇదే కథాంశంతో రూపొందిన ఛపాక్ మేఘన గుల్జార్ దర్శకత్వం వహించగా దీపికా స్వయంగా నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం 2020 జనవరి 10 న విడుదల కానుంది.