ఆ హీరో నన్ను మోసం చేసాడు

Published on Mar 15,2020 05:35 PM
ఆ హీరో నన్ను మోసం చేసాడు ఒకసారికాడు రెండుసార్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ దీపికా పదుకోన్. ఇంతకీ ఈభామ ఆరోపణలు చేస్తోంది ఏ హీరో మీదనో తెలుసా ........ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మీద. దీపికా పదుకోన్ - రణబీర్ కపూర్ లు ఇద్దరు కూడా ఘాటుగా ప్రేమించుకున్నారు ఇక పెళ్లి కావడమే తరువాయి అని వినిపించింది. ఇద్దరూ సహజీవనం కూడా చేసారు కట్ చేస్తే పెళ్లి పెటాకులు అయ్యింది.

తనని ప్రేమిస్తున్నానని చెప్పి మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడని అది తనకు తెలిసి నిలదీయడంతో సారీ చెప్పాడని , ఇకపై ఇలాంటివి పునరావృతం కావని అన్నాడని , అయితే నేను గుడ్డిగా నమ్మానని ఇక రెండోసారి అయితే ఏకంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని అందుకే బ్రేకప్ అయ్యిందని అంటోంది దీపికా పదుకోన్. రణబీర్ కపూర్ నన్ను మోసం చేసాడని , కానీ రణ్వీర్ సింగ్ మాత్రం నన్ను నిజాయితీగా ప్రేమించాడని అందుకే పెళ్లి చేసుకున్నామని అంటోంది. అయితే దీపికా పదుకోన్ చేసిన ఆరోపణల పట్ల ఇంతవరకు రణబీర్ కపూర్ స్పందించలేదు.