డియర్ కామ్రేడ్ నాలుగు భాషల్లో రిలీజ్

Published on Mar 09,2019 09:47 AM

విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు , ఏకకాలంలో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో రిలీజ్ చేస్తున్నారు . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీవాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ కు ఎనలేని క్రేజ్ వచ్చింది దాంతో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని సౌత్ లో అన్ని బాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 

రష్మిక మందన్న ఈ చిత్రంలో క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది . ఇంతకుముందు గీత గోవిందం లో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి హిట్ కొట్టింది రష్మిక దాంతో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్ కు డిమాండ్ ఏర్పడింది . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఈనెల 17 న టీజర్ ని రిలీజ్ చేయనున్నారు డియర్ కామ్రేడ్ బృందం .