మే 22న డియర్ కామ్రేడ్

Published on Feb 28,2019 12:20 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం '' డియర్ కామ్రేడ్ ''. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా క్రికెట్ ప్లేయర్ గా రష్మిక మందన్న నటిస్తోంది . ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు గీత గోవిందం చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో డియర్ కామ్రేడ్ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది . 

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 22 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న డియర్ కామ్రేడ్ ని బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి మే 22 న భర్తీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు . కాకినాడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ లో విజయ్ దేవరకొండ గాయపడిన విషయం తెలిసిందే .