రూలర్ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే

Published on Nov 27,2019 02:47 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ చిత్రాన్ని డిసెంబర్ 20 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బాలయ్య సరసన ఇద్దరు భామలు సోనాల్ చౌహన్ , వేదికలు నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ కు బాలయ్య అభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది దాంతో ట్రైలర్ ని కూడా ఇలాగె కట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఆ చిత్ర బృందం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున హైదరాబాద్ లో డిసెంబర్ 15 న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమా డిసెంబర్ 20 న విడుదల కాబట్టి దానికి అయిదు రోజుల ముందు అంటే డిసెంబర్ 15 న ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలయ్య అభిమానుల సమక్షంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.