దర్బార్ ట్రైలర్ తో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Published on Dec 17,2019 12:51 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్ర ట్రైలర్ డిసెంబర్ 16 రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ తో పండగ చేసుకుంటున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక రజనీకాంత్ ముంబై కమీషనర్ పాత్రలో నటించాడు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని ఆలస్యంగా విడుదల చేసారు. ట్రైలర్ ముందుగా విడుదల చేయడం వల్ల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయని భావించిన దర్బార్ చిత్ర బృందం నిన్న ట్రైలర్ ని విడుదల చేసింది.

ఇక ఆ ట్రైలర్ నిచూసి రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దర్బార్ తో తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడుతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ కు కమర్షియల్ హిట్ దక్కక చాలా రోజులయ్యింది. ఇక ట్రైలర్ నిండా మాస్ కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రజనీ ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. జనవరి 9 న దర్బార్ చిత్రం భారీ ఎత్తున విడుదల అవుతోంది. చాలా రోజుల తర్వాత దర్బార్ తో రజనీకాంత్ హిట్ కొట్టడం ఖాయమని దర్బార్ బృందం భావిస్తోంది. ఇక రజనీకాంత్ కూడా దర్బార్ పై చాలా ధీమాగా ఉన్నాడట. అయితే అసలు రిజల్ట్ ఏంటి ? ఎలా ఉంటుంది అన్నది మాత్రం జనవరి 9 నే తేలనుంది.