దర్బార్ ట్రైలర్ వచ్చేది రేపే

Published on Dec 15,2019 03:58 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం దర్బార్. ఈ చిత్ర ట్రైలర్ ని రేపు అంటే డిసెంబర్ 16 సాయంత్రం విడుదల చేయనున్నారట. దర్బార్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 7 న చెన్నై మహానగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఆ సమయంలో దర్బార్ ట్రైలర్ ని విడుదల చేయాలి కానీ ఆరోజు ట్రైలర్ విడుదల చేయలేదు దాంతో రేపు సాయంత్రం  ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.

రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రజనీకాంత్ నటిస్తున్న చిత్రాల ట్రైలర్ లు , టీజర్ లు బాగానే ఉంటున్నాయి కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోతోంది దాంతో తీవ్ర నిరాశలో ఉన్నారు రజనీకాంత్ అభిమానులు. దర్బార్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు మరి వాళ్ళ ఆశలు నెరవేరుతాయా ? లేదా అన్నది మాత్రం జనవరి 9 న తేలనుంది ఎందుకంటే దర్బార్ చిత్రం ఆరోజే విడుదల అవుతోంది మరి.