తెలుగులో 15 కోట్లు రాబట్టిన దర్బార్

Published on Jan 17,2020 04:08 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం తెలుగులో 15 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది. జనవరి 9 న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి దాంతో తెలుగులో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. రజనీకాంత్ నటించిన గత చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు దాంతో రజనీకాంత్ చిత్రాలు అంటే ప్లాప్ అన్నట్లే అన్న ముద్ర పడింది. దాంతో పూర్తి స్థాయి వసూళ్లు రాలేదు లేకపోతే ఇప్పటికే బాక్సాఫీస్ బద్దలైపోయేది.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ అల ..... వైకుంఠపురములో చిత్రాలు బాగా పోటీ పడ్డాయి అయినప్పటికీ రజనీకాంత్ కూడా బాగానే వసూల్ చేసాడు రెండు తెలుగు రాష్ట్రాలలో. వారం రోజులో 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి దర్బార్ చిత్రానికి దాంతో ఈ సినిమా కోసం పెట్టిన ఏడున్నర కోట్ల పెట్టుబడి వచ్చింది బయ్యర్లకు. గతకొంత కాలంగా రజనీకాంత్ సినిమాలు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి బయ్యర్లకు దాంతో ఈ సినిమా కొన్న వాళ్లకు లాభాలు వచ్చి పడ్డాయి.