సాహో లో హింస ఎక్కువగా ఉందట

Published on Aug 22,2019 12:34 PM

సాహో ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది అయితే ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తామని అన్నారట ! అయితే దర్శక నిర్మాతల అభ్యర్థన మేరకు కొన్ని సీన్స్ కి కట్ చెప్పి యు / ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిర్ణయించారట . సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే . 

ప్రభాస్ హీరోగా నటించగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో తెరెకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో హింస ఎక్కువగా ఉందట ! యాక్షన్ సీన్స్ మాత్రం మాస్ ప్రేక్షకులకు , ప్రభాస్ అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చడం ఖాయమని అంటున్నారు .