విజయ్ దేవరకొండ చిత్రానికి స్టన్నింగ్ బిజినెస్

Published on Mar 23,2019 11:54 AM

వరుస విజయాలతో రేసులో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ఈ హీరో నటించిన చిత్రం '' డియర్ కామ్రేడ్ ''. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన డియర్ కామ్రేడ్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే . టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఒక్కసారిగా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది . దాంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నారు బయ్యర్లు . 

తెలంగాణలో ఈ సినిమాని సొంతం చేఉస్కోవడానికి పలువురు పోటీ పడగా ఏషియన్ సినిమాస్ వాళ్ళు అత్యధికంగా 7. 60 కోట్లకు నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు . విజయ్ దేవరకొండ కు ఇది  మంచి రేటు . ఒక్క నైజాం లోనే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు.