వరల్డ్ ఫేమస్ లవర్ కు క్రేజ్ పెరిగింది

Published on Feb 11,2020 04:52 PM

నిన్న మొన్నటి వరకు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు కానీ ఎప్పుడైతే విజయ్ దేవరకొండ లైన్ లోకి వచ్చాడో ఇక అప్పటి నుండి ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే మల్టీప్లెక్స్ లలో హౌజ్ ఫుల్స్ పడుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్ లో. ఈనెల 14 న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదల అవుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యింది.

అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కావడమే ఆలస్యం దాదాపుగా మల్టీప్లెక్స్ లలో 70 పర్సెంట్ ఫుల్స్ అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడా ఖాళీలు ఉన్నాయి అవి కూడా ఈరోజు రేపటిలోగా ఫుల్స్ అయ్యేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో మల్టీప్లెక్స్ లలో ఫుల్స్ పడుతున్నాయి. ఇక సినిమా బాగుంటే తప్పకుండా ఈ జోష్ మీరింతగా పెరగడం ఖాయం. అయితే బిసి కేంద్రాల్లో మాత్రం ఇంత జోష్ కష్టమే ! సినిమా బాగుందని టాక్ వస్తేనే ఫుల్స్ పడతాయి.