లిప్ లాక్ లతో రెచ్చిపోతున్న జంట

Published on Feb 11,2020 02:49 PM

పూరి జగన్నాద్ కొడుకు లిప్ లాక్ లతో రెచ్చిపోతున్నాడు. పూరి అంటేనే ఓ మాదిరి సన్నివేశాలు ఉంటాయి అందుకు తగ్గట్లుగానే పూరి జగన్నాద్ కొడుకు పూరి ఆకాష్ సినిమా రొమాంటిక్ కూడా ఉండేలా కనబడుతోంది. ఇప్పటికే రొమాంటిక్ చిత్రం నుండి విడుదలైన పలు భంగిమలు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతుండగా తాజాగా విడుదలైన లిప్ లాక్ పోస్టర్ మరింతగా వేడెక్కిస్తోంది. పూరి ఆకాష్ హీరోగా నటిస్తుండగా హాట్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

పూరి చిత్రాల్లో ఉండే హీరోయిన్ మాదిరిగానే ఈ భామ కూడా సిగ్గు ఎగ్గూ అన్నది లేకుండా వీర లెవల్లో రెచ్చిపోతోంది. పూరి ఆకాష్ తో ఘాటుగా శృంగార సన్నివేశాల్లో నటించిందట ఈ భామ. ఇక తాజాగా విడుదలైన లిప్ లాక్ పోస్టర్ ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతోంది. బస్ ఫుట్ బోర్డు పై లిప్ లాక్ ని ఆస్వాదిస్తూ యువతరాన్ని ఊహాలోకాల్లోకి తీసుకెళ్తున్నారు. మొత్తానికి రొమాంటిక్ చిత్రం ఈ రకమైన పోస్టర్ లతో మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. మే 29 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన పూరి ఆకాష్ మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడా ?