అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న జంట

Published on Nov 18,2019 05:36 PM

పెళ్లి చేసుకోలేదు కానీ అనధికారికంగా మాత్రం భార్యాభర్తల్లాగే వ్యవహరిస్తున్నారు నయనతార - విగ్నేష్ శివన్ లు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలోని న్యూయార్క్ లో ఫులుగా ఎంజాయ్ చేస్తున్నారు. న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి ఎవరేమి అనుకున్నా లెక్క చేసేది లేదు మాదారి మాదే అంటూ ఎంజాయ్ చేస్తున్నారు నయనతార - విగ్నేష్ శివన్ లు.

పీకల్లోతు ప్రేమలో పడటం ..... ఫుల్లుగా ఎంజాయ్ చేయడం  ఆ తర్వాత మోసపోయానని బాధపడటం కామన్ అయ్యింది ఈ భామకు దాంతో ప్రేమ వరకే వ్యవహారం సాగిస్తోంది పెళ్లి వరకు వెళ్లి వ్యవహారం బెడిసి కొడుతోంది కాబట్టి పెళ్లి ముచ్చట లేకుండానే ఆ ముచ్చట తీర్చుకుంటోంది నయనతార. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామకు ఊహించని స్టార్ డం వచ్చింది కానీ పెళ్లి యోగం మాత్రం లేనట్లుంది పాపం.