హీరోయిన్ శ్రియా భర్తకు సోకిన కరోనా

Published on Apr 15,2020 04:20 PM
హీరోయిన్ శ్రియా శరన్ భర్త ఆండ్రు కోస్చీవ్ కు కరోనా సోకింది. అయితే ఈ విషయాన్నీ ఆమె ఆలస్యంగా వెల్లడించింది. స్పెయిన్ కు చెందిన ఆండ్రు కోస్చీవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియా శరన్. స్పెయిన్ లో కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయితే ఆండ్రు కు పొడి దగ్గు , జలుబు , జ్వరం సోకడంతో ముందుగా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందట.

దాంతో అడ్మిట్ అయి పూర్తి స్థాయి చికిత్స తీసుకున్నాడు. చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ రావడంతో డిస్చార్జ్ అయ్యాడు. దాంతో నా భర్తకు కరోనా వచ్చింది , ఇపుడు తగ్గింది డిస్చార్జ్ అయ్యాడు అంటూ చెబుతోంది శ్రియా శరన్. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియా శరన్. తాజాగా బాలకృష్ణ - బోయపాటి శ్రీను సినిమాలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.