హీరో విజయ్ కి కరోనా పరీక్షలు !

Published on Mar 30,2020 10:52 PM
ఇళయ దళపతి విజయ్ కి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. తమిళ స్టార్ హీరో విజయ్ కొన్నాళ్ల క్రితం విదేశాలకు వెళ్ళొచ్చాడు దాంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో విజయ్ కు ఎలాంటి వ్యాధి సోకలేదని తేల్చారు డాక్టర్లు. అయితే ఫారిన్ వెళ్లొచ్చారు కాబట్టి విజయ్ కుటుంబ సభ్యులను సైతం పరీక్షించి శానిటైజర్ స్ప్రే చేసి వెళ్లారు. కరోనా లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కరోనా వైరస్ విదేశాల నుండి దిగుమతి అయి మొత్తంగా భారతదేశాన్ని వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. తాజాగా విజయ్ మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది తేలకుండా ఉంది.