వివాదంలో వాల్మీకి చిత్రం

Published on Jan 30,2019 01:55 PM

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న వాల్మీకి చిత్రం వివాదంలో చిక్కుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే వాల్మీకి టైటిల్ లో రివాల్వర్ ని ఉంచడంతో ఈ వివాదం ముదురుతోంది. వాల్మీకి టైటిల్ ని వెంటనే తీసేయ్యాలని అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాల్మీకి కులసంఘాలు.

సినిమా ప్రారంభంలోనే  ఇలా వివాదాలు చుట్టుముట్టడంతో ఆ చిత్ర బృందం షాక్ అయ్యింది. వాల్మీకి కులస్తులకు సారీ చెబుతారా ? లేక రాజీ ప్రయత్నాలు చేస్తారా ? చూడాలి. ఎఫ్ 2 తో సూపర్ హిట్ కొట్టేసిన వరుణ్ మంచి జోష్ మీదున్నాడు.