నిఖిల్ ని మాయ చేసారు

Published on Jan 24,2019 05:42 PM

యంగ్ హీరో నిఖిల్ కు మంచి మార్కెట్ ఉంది , విభిన్నతరహా చిత్రాలను చేస్తున్నాడని అయితే అదే ఇప్పుడు అతని పాలిట శత్రువు అయ్యింది . ఎందుకంటే తాజాగా ఎవరో తీసిన ముద్ర అనే సినిమా ని నిఖిల్ సినిమాగా ప్రచారం చేసుకోవడమే కాకుండా ఏకంగా రేపు సినిమా రిలీజ్ చేస్తున్నామని బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసారు . ఈ విషయం నిఖిల్ కు తెలియడంతో దానిపై స్పందించాడు . 

ముద్ర అనే టైటిల్ తో నిఖిల్ ఓ సినిమాలో నటిస్తున్నాడు కాగా ఆ సినిమా తుది దశకు చేరుకుంది . ఫిబ్రవరిలో ఆ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది . అయితే అంతేకంటే ముందే అంటే జనవరి 25 న నిఖిల్ ముద్ర రిలీజ్ అంటూ ప్రకటనలు జారీ చేయడమే కాకుండా మల్కాజి గిరి థియేటర్ లో బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసారు . నిఖిల్ ఈ విషయంపై స్పందిస్తూ నిర్మాతలు చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు అంటూ ప్రకటించాడు .