ఆర్ ఆర్ ఆర్ ని వివాదాలు చుట్టుముట్టనున్నాయా ?

Published on Mar 16,2019 02:26 PM

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ '' . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి . ఎందుకంటే అల్లూరి సీతారామరాజు - కొమరం భీం ల నేపథ్యాన్ని ఎంచుకున్నాడు అదే పెద్ద వివాదాన్ని రాజేయొచ్చు అలాగే అల్లూరి పోరాడింది బ్రిటిష్ పాలకుల మీద అలాగే కొమరం భీం పోరాడింది నైజాం నవాబుల మీద దాంతో తప్పకుండా హిందూ , ముస్లిం , క్రిస్టియన్ ల ప్రస్తావన తో వివాదాన్ని రాజేయొచ్చు. 

అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్ కొమరం భీం గా ఎన్టీఆర్ లు నటిస్తున్నారు . 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు . తెలుగు , తమిళ , హిందీ , మలయాళ బాషలలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం 2020 జులై 30 న రిలీజ్ కానుంది.