వివాదాస్పద భామకు అతడు కావాలట

Published on Mar 15,2020 02:25 PM

వివాదాస్పద భామ మీరా మిథున్ కు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిత్యానంద స్వామి కావాలని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. నిత్యానంద స్వామి ని నేను ఒక్కసారైనా కల్సి మాట్లాడాలని , ఆ కోరిక ఎప్పుడు నెరేవేరుతుందో అన్న ఆతృతగా ఉంది. నిత్యానంద స్వామి పట్ల తనకున్న ప్రేమని వ్యక్తం చేస్తూ ఓ వీడియో కూడా రూపొందించింది మీరా మిథున్. ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది.

తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ భామ మధ్యలోనే బయటకు వచ్చింది . బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసిన ఈ భామ పలు వివాదాల్లో చిక్కుకుంది కూడా. అయితే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా డోంట్ కేర్ అంటోంది. ఇక అందులో భాగంగానే నిత్యానంద ని కలవాలని ఆశపడుతోంది. అయితే నిత్యానంద కోసం తమిళనాడు పోలీసులు , కర్ణాటక పోలీసులు కూడా వెదుకుతున్నారు. అతడు మాత్రం వాళ్లకు దొరకడం లేదు మరి మీరా మిథున్ కు దొరుకుతాడేమో చూడాలి ఎంతైనా మహిళా భక్తురాలు కదా !