నాగశౌర్య పై ఫిర్యాదు

Published on Feb 08,2020 12:47 PM

హీరో నాగశౌర్య పై మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేసారు డ్రైవర్ యూనియన్ లు. ఇలా వీళ్ళు ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటో తెలుసా ...... అశ్వద్ధామ అనే చిత్రంలో డ్రైవర్ లను కించపరిచేలా సన్నివేశాలతో పాటుగా డైలాగ్స్ ఉండటమే! తాజాగా ఈ హీరో అశ్వద్ధామ అనే చిత్రంలో నటించాడు. అమ్మాయిల కిడ్నాప్ , హత్యల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. జనవరి 31 న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించడం లేదు.

వారం రోజుల్లో నాలుగు కోట్ల 60 లక్షల షేర్ వసూల్ చేసింది అశ్వద్ధామ చిత్రం. ఈరోజుల్లో వారం , పది రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలి కానీ ఈ సినిమా మాత్రం పెట్టిన పెట్టుబడి రాబట్టుకోలేదు. దాంతో నాగశౌర్య కు నష్టాలు తెచ్చేలా ఉంది. ఇక డ్రైవర్ ల విషయానికి వస్తే మా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ మానవ హక్కుల కమీషన్ ని ఆశ్రయించారు. మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కథ నాగశౌర్య అందించడం విశేషం.