ఆ సినిమాపై ఫిర్యాదులు

Published on Nov 17,2019 08:14 AM

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తాజాగా నటించిన చిత్రం '' మర్దానీ 2''. డిసెంబర్ 13 న విడుదలకు సిద్దమైన ఈ చిత్రం పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మర్దానీ 2 పై ఫిర్యాదులు వెల్లువెత్తడానికి కారణం ఏంటో తెలుసా ........ మర్దానీ 2 చిత్రం అత్యాచారాలు , హత్యల నేపథ్యంలో తెరకెక్కింది అంతేకాదు ఈ చిత్రంలో కోటా పేరు ప్రస్తావన ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

ఎంతో ప్రఖ్యాతి గాంచిన కోటా పేరుని హత్యలు , అత్యాచారాల నేపథ్యంలో ఉన్న సినిమాలో ప్రస్తావించడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోటా వాసులు. పైగా లోక్ సభ స్పీకర్ కోటా పార్లమెంట్ స్థానం నుండి ఎంపిక కావడంతో ఆయన దగ్గరకు ఈ అంశాన్ని తీసుకెళ్లారు దాంతో సినిమాలో కోటా ప్రస్తావన అంశాన్ని తెలుస్తానని అంటున్నాడు. రాజస్థాన్ లోని కోటా పార్లమెంట్ స్థానం నుండి ఎంపిక అయ్యాడు ఓం బిర్లా , స్పీకర్ అభ్యంతరం చెబుతున్నాడు కాబట్టి తప్పకుండా కోటా అనే పేరు తొలగించాల్సి రావచ్చు.