రోజా పై తీవ్ర స్థాయిలో విమర్శలు

Published on Apr 22,2020 05:00 PM
నటి , నగరి ఎం ఎల్ ఏ రోజా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక జనసేన సైనికులు అయితే రోజా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా రోజా పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటో తెలుసా ....... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో రోజా తన నియోజకవర్గ పర్యనటలో భాగంగా ఓ గ్రామంలోకి వెళ్ళింది. ఆ సమయంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా ఆ ఊరి ప్రజలు పూలతో స్వాగతం పలికారు రోజాకు.

పూలతో స్వాగతం పలికితే తప్పులేదు కానీ ఆ పూలు రోజా కాళ్ళ కింద వేయడం , ఆమె ఆ పూలని తొక్కుకంటూ నడవడం వివాదానికి కారణమైంది. రోజా నడుస్తుంటే దారికి ఇరువైపులా ఉన్న ప్రజలు పూలను ఆమె కాళ్ళ కింద వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలే కరోనా సమయం అలాంటిది కనీస దూరం పాటించలేదు అలాగే పూలను ఇలా కింద పడేయడం ఏంటి ? రోజా అయినా అభ్యంతరం చెప్పాలి కదా ! అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు జనసేన సైనికులు.