నటుడు శ్రీనివాస రెడ్డి తండ్రి మృతి

Published on Feb 01,2019 04:14 PM

ప్రముఖ హాస్య నటుడు , హీరో శ్రీనివాస్ రెడ్డి తండ్రి రామిరెడ్డి ( 82) చనిపోయారు . జనవరి 24 న రామిరెడ్డి చనిపోయాడు అయితే ఈ విషయాన్నీ ఈరోజు మాత్రమే మీడియాకు వెల్లడించాడు శ్రీనివాస రెడ్డి . రామిరెడ్డి కూడా నటుడే ....... శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా అనే చిత్రంలో ఉపాధ్యాయుడిగా చిన్న పాత్ర పోషించాడు . 

తెలుగు సినిమాల్లో పలు రకాల పాత్రలను పోషించాడు శ్రీనివాస రెడ్డి . అలాగే హీరోగా కూడా నటించాడు . శ్రీనివాస రెడ్డి తండ్రి మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు శ్రీనివాస రెడ్డి కి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .