హీరోగా మారిన కమెడియన్ మహేష్

Published on Feb 27,2019 02:01 PM

జబర్దస్త్ ప్రోగ్రాం తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన మహేష్ ఆ తర్వాత వెండితెర పై కూడా మెప్పించాడు . పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన మహేష్ కు రంగస్థలం చిత్రం బ్రేక్ నిచ్చింది . రాంచరణ్ తో కలిసి నటించిన మహేష్ తాజాగా ''నేను నా నాగార్జున '' అనే చిత్రంలో హీరోగా నటించాడు .  కమెడియన్ లు హీరోలుగా పలు చిత్రాల్లో నటించారు కానీ ఎవరు కూడా ఫుల్ టైమ్ హీరోలుగా రాణించలేకపోయారు . 

కమెడియన్ గా మంచి పొజీషన్ లో ఉన్న మహేష్ హీరో అయ్యాడు . అయితే హీరోగా నటించి సక్సెస్ కాకపోతే అది అవమానమే కదా ! అయినప్పటికీ ధైర్యం చేసి హీరోగా నటిస్తున్నారు హాస్య నటులు . మహేష్ హీరోగా సక్సెస్ కొడతాడో ? లేక చతికిల బడతాడో చూడాలి.