అలీ ఇంట్లో విషాదం: తల్లి మృతి

Published on Dec 19,2019 05:59 PM

హాస్య నటుడు అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలీ తల్లి జైతన్ బీబీ నిన్న సాయంత్రం రాజమండ్రి లో కన్నుమూసింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి రాజమండ్రిలో నివసిస్తోంది. అలీ కి తల్లి అంటే ఎనలేని గౌరవం , అభిమానం దాంతో కన్నతల్లిని చాలా బాగా చూసుకుంటున్నాడు. అలీ స్వగ్రామం రాజమండ్రి కావడంతో కొంత కాలంగా అలీ తల్లి అక్కడే ఉంటోంది. అయితే నిన్న ఆమె చనిపోయిన విషయం తెలియగానే షూటింగ్ లో ఉన్న అలీ వెంటనే హైదరాబాద్ బయలుదేరాడు. ఇక తల్లి పార్దీవ దేహాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో అలీ తల్లి జైతన్ బీబీ అంత్యక్రియలు ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో చేయనున్నారు. జైతన్ బీబీకి ఇద్దరు కొడుకులు కాగా అందులో అలీ పెద్దవాడు. ఇక మరో నటుడు ఖయ్యుమ్ కూడా అలీ తమ్ముడే అన్న విషయం తెలిసిందే. అలీ తల్లి మరణించిందన్న విషయం తెలియడంతో అలీ కి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు పలువురు సినీ ప్రముఖులు. తెలుగులో దాదాపు 1000 సినిమాల్లో నటించాడు అలీ.