బాబూమోహన్ పై మండిపడుతున్న మెగాస్టార్ ఫ్యాన్స్

Published on Oct 23,2019 12:29 PM
హాస్య నటుడు బాబూమోహన్ పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబూమోహన్ పై చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... చిరంజీవి కంటే బాలకృష్ణ అద్భుతంగా గుర్రపు స్వారీ చేస్తాడని , బాలయ్య ముందు ఎవరైనా సరే బలాదూరే అని చెప్పడమే కాకుండా చిరంజీవి , గిరంజీవి జాన్తా నై అంటూ చిరంజీవి పేరు మధ్యలో తీసుకొచ్చాడు బాబూమోహన్ దాంతో చిరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తెలుగులో ఒకప్పుడు టాప్ కమెడియన్ గా ఉన్న బాబూమోహన్ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. రాజకీయాల్లోకి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి గా కూడా పనిచేసాడు. ఇక ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు బాబూమోహన్. బాలయ్య ని పొగిడితే తప్పులేదు కానీ చిరంజీవి ని అవమానించడం సరికాదేమో బాబూమోహన్.