వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Published on Mar 05,2019 12:12 PM

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చాడట ! చిరంజీవి కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడమే ! ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది . అంటే అనుకున్న విధంగా షూటింగ్ పూర్తికాకపోవడంతో చిరుకి అసహనం పెరిగిపోయిందట దాంతో దర్శకులు సురేందర్ రెడ్డి పై ఇతరులపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాడట . 

సైరా నరసింహారెడ్డి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది . ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , జగపతిబాబు , నయనతార , విజయ్ సేతుపతి , నిహారిక తదితరులు నటిస్తున్నారు . కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .