కొరటాల శివకు సారీ చెప్పిన చిరంజీవి

Published on Mar 04,2020 04:11 PM

మెగాస్టార్ చిరంజీవి దర్శకులు కొరటాల శివ కు సారీ చెప్పాడు. మెగాస్టార్ ఏంటి ? కొరటాల శివ కు సారీ చెప్పడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇటీవల జరిగిన ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అథితిగా వచ్చాడు. అయితే మాటల మధ్యలో తన సినిమా పేరు ఆచార్య అని చెప్పేసాడు పాపం. అది అనుకోకుండా జరిగిపోవడంతో ఖంగుతిన్నాడు కానీ ఏమి చేయలేని పరిస్థితి. కట్ చేస్తే దర్శకులు కొరటాల శివ చాలా ఫీల్ అయ్యాడట !

ఎంతో ప్రతిష్టాత్మకమైన మన సినిమా టైటిల్ ని చాలా కూల్ గా అది కూడా మరో సినిమా ఫంక్షన్ లో చెప్పడం ఏంటి ? అని. కొరటాల ఈ విషయంలో చాలా బాధపడ్డాడట దాంతో ఈ విషయం చిరంజీవికి తెలియడంతో అది అనుకోకుండా జరిగిపోయిందని అందుకు నన్ను క్షమించాలని కోరాడట కొరటాల శివని. తాజాగా చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాలోని చిరంజీవి గెటప్ లీక్ కావడంతో చాలా కోపంగా ఉన్నారు ఇక ఇప్పుడేమో ఏకంగా టైటిల్ కూడా రివీల్ కావడంతో మరింత బాధపడుతున్నాడట కొరటాల.