చిరంజీవి చిన్నల్లుడి సినిమా సూపర్ మచ్చి

Published on Oct 26,2019 03:54 PM
చిరంజీవి చిన్నల్లుడి సినిమా సూపర్ మచ్చి

సూపర్ మచ్చి ..... సూపర్ మచ్చి అనే మాస్ సాంగ్ అల్లు అర్జున్ చిత్రం లోనిది కాగా అదే పదాన్ని తన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ కు నటన అంటే ఆసక్తి ఉండటంతో విజేత అనే సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసాడు కళ్యాణ్ దేవ్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
          దాంతో కొంతకాలం సైలెంట్ అయిన కళ్యాణ్ దేవ్ తాజాగా '' సూపర్ మచ్చి '' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేసారు. సూపర్ మచ్చి చిత్రంలో కళ్యాణ్ దేవ్ ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా కళ్యాణ్ దేవ్ హిట్ కొడతాడా చూడాలి.