మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన చిరంజీవి

Published on Jan 15,2020 06:02 PM

మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు షాక్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చూస్తానని చెప్పాడు పబ్లిక్ లో కానీ ఇంతవరకు చిరంజీవి ఈ  సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. జనవరి 12 న చిరంజీవి నుండి వచ్చే ఫోన్ కాల్ గురించి ఎదురు చూస్తానంటూ మహేష్ బాబు చెప్పాడు కూడా. జనవరి 11 న సరిలేరు నీకెవ్వరు విడుదల కాగా ఆ సినిమా విడుదలై నేటికీ అయిదు రోజులు కావస్తోంది  అయినప్పటికీ చిరంజీవి నుండి ఇంతవరకు ఫోన్ కాల్ రాలేదు మహేష్ బాబుకు.

చిరంజీవి ఫోన్ కాల్ చేస్తానని అన్నాడు చేయలేదు , మహేష్ బాబు ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తానని అన్నాడు కానీ చిరు నుండి కాల్ రాలేదు. అంటే మహేష్ బాబు కు షాక్ ఇచ్చినట్లే కదా ! జనవరి 11 న విడుదలైన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొత్త ఏడాదిలో బ్లాక్ బస్టర్ ని అందించింది టాలీవుడ్ కు.