కొరటాల శివ ని అవమానించిన చిరంజీవి

Published on Jan 21,2019 03:08 PM

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ని అవమానించారు . కొరటాల చెప్పిన కథ నచ్చకపోవడంతో ఆ కథ వద్దని మరో కథ రెడీ చేయాలని చెప్పాడట ! దాంతో చేసేదిలేక మరో కథ రెడీ చేస్తున్నాడు కొరటాల శివ . ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ ఆలస్యం అయితే మే లేదా జూన్ లో తప్పనిసరిగా సెట్స్ మీదకు వెళ్తుందట . 

అయితే మొదటిసారి చెప్పిన కథ చిరుకి నచ్చలేదు కానీ రెండోసారి చెప్పిన కథ నచ్చిందట దాంతో అదే కథతో సినిమా రూపొందనుంది . మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను వంటి వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన దర్శకుడు కథ చెబితే వెంటనే ఓకే చేస్తారు కానీ చిరు మాత్రం నో చెప్పాడు అంటే చిరు కి ఆ కథ నచ్చలేదా ? లేక అది చిరుకి సెట్ కాదేమో అన్న మాట వినబడుతోంది .