చిరంజీవి ఆ సినిమా చూసి బాధపడ్డాడట

Published on Apr 22,2020 04:26 PM
మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం చూసి చాలా బాధపడ్డాడట. స్వాతిముత్యం చూడటం ఏంటి ? బాధపడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంతకీ అసలు విషయం ఏంటంటే ....... స్వాతిముత్యం 1986 లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సినిమా చూసిన చిరంజీవి కమల్ నటనకు ఫిదా అయ్యాడట. ఎంత అద్భుతమైన పాత్ర లభించింది , ఎంత అద్భుతంగా కమల్ నటించాడు నాకు ఇలాంటి పాత్ర అసలు వస్తుందా ? రాదా ? అని చాలా బాధపడ్డాడట.

చిరంజీవి అంతగా బాధపడటానికి కారణం ఏంటో తెలుసా ....... మెగాస్టార్ చిరంజీవి అంటే పక్కా కమర్షియల్ హీరో. చిరు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేసాడు తన కెరీర్ లో అయితే అడపా దడపా కొన్ని ఇతర చిత్రాలు కూడా చేసాడు కానీ స్వాతిముత్యం లాంటి చిత్రం చేయలేదని బాధపడుతున్న సమయంలో విశ్వనాధ్ దర్శకత్వంలో స్వయంకృషి , ఆపద్భాంధవుడు లాంటి చిత్రాలు చేసాడు చిరు. ఇక స్వయంకృషి చిత్రంలోని చిరు నటనకు అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు కూడా దక్కాయి.