పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

Published on Nov 27,2019 12:01 PM

తమ్ముడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు అన్న మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై అన్నయ్య చిరు చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా ........ చేగువేరా ని చూస్తే నాకు ఎవరు గుర్తుకు వస్తారో తెలుసా ........ అంటూ తన మెడ పై చేయి వేసి అభిమానులను ఉర్రూతలూగించారు చిరంజీవి. చిరు చేగువేరా అనగానే పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గోల గోల చేసారు దాంతో అవును చేగువేరా ని తల్చుకుంటే నాకు వెంటనే గుర్తుకు వచ్చేది నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాడు చిరు.

ఈ సంఘటన నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అథితిగా పాల్గొన్నాడు చిరంజీవి. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో చేగువేరా ప్రస్తావన రావడంతో పై వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు చిరు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే ఫ్యాన్స్ ఈలలు , గోలలతో నిండిపోయింది ఆ వేడుక.