నోరు జారిన చిరంజీవి

Published on Mar 02,2020 06:32 PM

మెగాస్టార్ చిరంజీవి నోరు జారాడు దాంతో అతడి సినిమా టైటిల్ లీకైపోయింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని పెట్టాలని భావిస్తున్నారు అయితే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ నిన్న ఓ పిట్ట కథ అనే సినిమా ఈవెంట్ కు హాజరైన చిరంజీవి ఆ సినిమా గురించి మాట్లాడుతూ అప్రయత్నంగానే ఆచార్య టైటిల్ ని చెప్పేసాడు.

ఇంకేముంది ఆ వేడుకకు వచ్చిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తనకు తెలియకుండానే టైటిల్ ని ప్రకటించడంతో షాక్ అయ్యారు. అయితే ఆ వెంటనే తేరుకున్నాడు కానీ అప్పటికే ఆ టైటిల్ లీకైపోయింది. ఇప్పటికే ఈ సినిమాలోని చిరంజీవి గెటప్ కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. నక్సలైట్ గెటప్ లో ఉన్న చిరంజీవి గెటప్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే ....... మహేష్ బాబు స్టూడెంట్ లీడర్ గా నటించడం.