డైరెక్టర్ గా మారుతున్న చిరంజీవి కూతురు

Published on Apr 25,2020 08:19 AM
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత డైరెక్టర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా ఫ్యాషన్ డిజైనర్ గా పలు చిత్రాలకు పనిచేసింది సుస్మిత. అయితే ఇన్నాళ్ళుగా షూటింగ్ లను ఫాలో అవుతున్న ఈ భామ తాను కూడా మెగా ఫోన్ పట్టి యాక్షన్ , కట్ చెప్పాలని డిసైడ్ అయ్యిందట. అయితే ఒకేసారి వెండితెర మీద తన అదృష్టాని పరీక్షించుకోకుండా వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించాలని భావిస్తోందట.

ఇక చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లలో నటించాలని తహతహలాడుతున్నాడు. ఇటీవలే వెబ్ సిరీస్ లలో నటించాలనే ఆసక్తి వ్యక్తం చేసాడు చిరు. దాంతో తండ్రిని కూతురు డైరెక్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇన్నాళ్లు ఫ్యాషన్ డిజైనర్ గా తెరవెనుకే ఉన్న ఈ భామ ఇప్పుడు మెగా ఫోన్ పట్టి తండ్రిని డైరెక్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోందట. ఇప్పటికే పలు కథలు విన్నదట. త్వరలోనే వాటిలో మెగాస్టార్ కు నచ్చిన కథని తీసుకొని వెబ్ సిరీస్ చేయనున్నట్లు సమాచారం. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఈ వెబ్ సిరీస్ పై ఓ అవగాహనకు రానున్నారట.