చెక్ బౌన్స్ కేసులో నట్టికుమార్ కు జైలుశిక్ష

Published on Mar 08,2020 05:03 PM

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ కు చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడింది. ఏడాది జైలు శిక్ష తో పాటుగా 6 లక్షల జరిమానా కూడా విధించింది విజయనగరం కోర్టు. సంఘటన వివరాలలోకి వెళితే ...... 2009 లో గోపీచంద్ హీరోగా నటించిన శంఖం చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాడు నట్టికుమార్. అయితే ఆ సినిమాని విజయనగరం లోని రాజ్యలక్ష్మీ థియేటర్ లో ప్రదర్శించడానికి గాను రవికుమార్ తో ఒప్పందం చేసుకొని 6. 5 లక్షలు తీసుకున్నాడు నట్టికుమార్.

అయితే సినిమా విడుదల అయ్యింది కానీ రెండు రోజులు మాత్రమే ప్రదర్శించారు దాంతో పెద్ద మొత్తంలో నష్టపోయాడు ఆ థియేటర్ ఓనర్ . ఈ విషయం ఛాంబర్ కు చేరడంతో 5. 5 లక్షలను రవికుమార్ కు ఇవ్వాలని చెప్పారు పెద్దలు దాంతో చెక్ ఇచ్చాడు నట్టికుమార్ అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో కేసు వేసాడు. సంఘటన వివరాలు అన్ని తెలుసుకున్న కోర్టు ఏడాది జైలు శిక్ష విధించడమే కాకుండా 6 లక్షల జరిమానా కూడా విధించారు.