పూరి కనెక్ట్స్ఆధ్వర్యంలో 15 లక్షల ఆర్థికసాయం అందచేసిన పూరి, ఛార్మీల హెల్పింగ్ హ్యాండ్.

Published on Sep 29,2019 10:38 AM

సెప్టెంబర్ 28 డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టిన రోజు సందర్భముగా దర్శకత్వ శాఖలో  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న30 మందికి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతిఒక్కరికి 50000 ల చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేశారు పూరి కనెక్ట్స్ నిర్మాత ఛార్మికౌర్. ఈ సందర్భముగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
ఛార్మి మాట్లాడుతూ - " ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక సారి పూరి గారు నేను కూర్చొని ఉన్నప్పుడు నీకో విషయం తెలుసా దాసరి గారు నా గురించి ఎంత పెద్ద మాట అన్నారో.. నా తరువాత  పూరి జగన్నాధ్ గారు నా వారసుడు అన్నారు అని చాలా ఎమోషనల్ గా చెప్పారు. ఆరోజు నుండే నా మనసులో దాసరి గారు లాంటి ఒక లెజండరీ పర్సన్ పూరి గారికి ఇంత మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం అనుకోవడం జరిగింది. ఆరోజు పూరి ఇచ్చిన ధైర్యం తో ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్  చేశాం. ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు కానీ పూరి గారిని నమ్మి ఈ సినిమా చేసిన రియల్ హీరో రామ్ పోతినేని. రామ్ మాకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉన్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఈరోజు మేము ఈ సాయం చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం పూరి గారి పుట్టిన రోజు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. పూరి గారు మీ అందరి కోసం మంచి మెస్సేజ్ పంపారు ఏంటనే" నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చిన నష్టం వచ్చినా దానికోసం చావడమే దాని గెలుపు" అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒకరికి థాంక్స్ 'అన్నారు.
ఈ కార్యక్రమం లో కాశి విశ్వనాధ్, నటుడు ఉత్తేజ్, డైరెక్టర్స్ యూనియన్ సెక్రటరీ రామ్ ప్రసాద్, సుబ్బా రెడ్డి , భాస్కర్ రెడ్డి , విష్ణువర్ధన్, ఆదుర్తి రమణ తదితరులు పాల్గొన్నారు.