స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఛార్మి , అనసూయ

Published on Oct 30,2019 11:26 AM

నిన్న రాత్రి జరిగిన మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు అందమైన భామలు ఛార్మి , అనసూయ. ఛార్మి ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది కానీ ఇప్పుడు తెరముందు కాకుండా తెరవెనుక ఉండి సినిమాని నడిపిస్తోంది అదేనండీ నిర్మాతగా మారింది. గ్లామర్ పాత్రలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ నిన్నటి ఈవెంట్ లో మెస్మరైజ్ చేసింది.

ఇక మరో భామ అనసూయ కూడా ఈ ఈవెంట్ లో తన అందచందాలతో మెరిసింది. జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిన అనసూయ వెండితెరపై కూడా అందాలు ఆరబోస్తూ తన ప్రత్యేకతని చాటుతోంది. విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నిన్నటి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.