చరణ్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం పక్కానట

Published on Dec 15,2019 06:46 PM

అబ్బాయ్ రాంచరణ్ తో సినిమా నిర్మిస్తానని చెప్పాడు బాబాయ్ పవన్ కళ్యాణ్. అయితే ఈ మాటలు అన్నది ఇప్పుడు కాదు దాదాపు మూడేళ్ళ క్రితం నాటి మాట. అయితే  పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి రోజులు , నెలలు , సంవత్సరాలు గడిచి పోతున్నాయి తప్ప సినిమా నిర్మాణం అయితే జరగలేదు కట్ చేస్తే ఇదే హామీని మళ్ళీ ఇచ్చాడట పవన్ కళ్యాణ్ చరణ్ తో పక్కాగా సినిమా చేస్తాను అని. హామీలు అయితే ఇస్తున్నాడు కానీ సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు మరి. దాంతో అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ? అన్న అనుమానం తలెత్తుతోంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ తో సినిమా చేయాలనీ అనుకున్న పవన్ కథా చర్చల్లో పాల్గొన్నాడట కానీ కథ ఏది కూడా ఓకే కాలేదు దాంతో రోజులు , నెలలు , సంవత్సరాలు గడిచి పోయాయట. సినిమా ఆలస్యం అవుతుందేమో కానీ మా కాంబినేషన్ లో సినిమా రావడం అయితే పక్కా అని మరోసారి నొక్కి వక్కాణించాడట పవన్ కళ్యాణ్. చరణ్ హీరోగా నటిస్తే పవన్ కళ్యాణ్ ఆ సినిమాని నిర్మించడానికి ముందుకు రానున్నాడట. ఇలా చరణ్ తో సినిమా చేయడం ద్వారా డబ్బులు సంపాదించ వచ్చు అని పవన్ భావిస్తున్నాడట.