రాజమౌళి ఛాలెంజ్ ని పూర్తిచేసిన చరణ్

Published on Apr 22,2020 04:56 PM
దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించాడు రాంచరణ్. తన భార్య ఉపాసనకు సెలవిచ్చి ఇంట్లో పనులన్నీ చరణ్ స్వయంగా చేసాడు అంతేకాదు తన భార్యకు కాఫీ పెట్టి మరీ ఇచ్చాడు. ఈ తతంగమంతా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు చరణ్. అలాగే రానా , త్రివిక్రమ్ , శర్వానంద్ , రణవీర్ సింగ్ లను ఈ పనులు చేయమని ఛాలెంజ్ విసిరాడు చరణ్.

అంతకుముందు ఎన్టీఆర్ తన ఛాలెంజ్ ని పూర్తిచేసి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో పాటుగా దర్శకులు కొరటాల శివ లను ఛాలెంజ్ చేసాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు చిరంజీవి. చరణ్ పని కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు చిరంజీవి. చరణ్ తన పని చేసాడు కాబట్టి ఇక చిరంజీవి ఇంటి పని చేయడం ఖాయం. అయితే బాలకృష్ణ స్పందన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది.