కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ మారింది

Published on Nov 28,2019 04:23 PM

రాంగోపాల్ వర్మ వివాదాస్పద టైటిల్ కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఎట్టకేలకు తీవ్ర నిరసనల మధ్య మార్చాడు. ఇంతకీ కొత్త టైటిల్ ఏంటో తెలుసా ....... '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' అని మార్చాడు. ఇన్నాళ్లు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వర్మ మాత్రం అస్సలు పట్టించుకోలేదు సరికదా టైటిల్ మార్చే ప్రసక్తే లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.

అయితే సినిమా విడుదల సమయానికి వచ్చేసరికి బెట్టు వీడి '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' అనే టైటిల్ పెట్టాడు. ఈనెల 29 న అంటే రేపే విడుదల చేయాలనీ అనుకున్నాడు వర్మ అయితే ఈ సినిమాపై వివాదం నడుస్తోంది దాంతో ఆ వివాదం కోర్టుకి చేరింది. అంటే ఈరోజు సాయంత్రానికి ఈ చిత్రం పై కోర్టు ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని బట్టే వర్మ వివాదాస్పద సినిమా విడుదల అవుతుందా ? లేదా ? అన్నది తేలనుంది.