కొత్త దర్శకులతో చేయడానికి భయపడుతున్న చైతూ

Published on Dec 12,2019 04:50 PM

కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి భయపడుతున్నాడు హీరో అక్కినేని నాగచైతన్య. ఈ యంగ్ హీరో కొత్త దర్శకులతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా ....... కొత్త దర్శకులు గట్టి షాక్ ఇచ్చారు మరి ఈ హీరోకు. జోష్ , దడ , బెజవాడ , యుద్ధం శరణం చిత్రాలకు కొత్త దర్శకులు ఆ చిత్రాలు నాగచైతన్య కు గట్టి గుణపాఠాన్ని నేర్పాయి అందుకే కొత్త దర్శకులతో సినిమాలు చేయలేను అని చెప్పేసాడు. అందుకు కారణం కూడా చెప్పాడు చైతూ ...... కొత్త దర్శకులు నేను చేసేది మాత్రమే తీసుకుంటారు అది బాగా వచ్చిందా ? లేదా ? అన్నది ఆలోచించరు పైగా నేను వాళ్ళకంటే సీనియర్ ని కాబట్టి మళ్ళీ టేక్ అని చెప్పడానికి భయపడతారు అదే రెండు మూడు సినిమాలు చేసిన వాళ్ళైతే అవసరం ఉన్నా లేకపోయినా రెండు మూడు టేక్ లు తీసుకుంటారని సెలవిస్తున్నాడు.

తాజాగా ఈ హీరో మేనమామ వెంకటేష్ తో కలిసి '' వెంకీమామ '' అనే చిత్రంలో నటించాడు. కె ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నాడు చైతు. మేనమామ తో కలిసి నటిస్తున్న వెంకీ మామ తప్పకుండా హిట్ అవుతుందన్న ధీమాలో ఉన్నాడు. నాగచైతన్య సరసన రాశి ఖన్నా నటించగా వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటించింది.