విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ సినిమాలో కేథరిన్ తెరిస్సా

Published on Feb 04,2019 12:31 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో ఓ సినిమా  తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. 

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా లో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది..

గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జే కే సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా, కేథరీన్ తెరిస్సా తదితరులు

సాంకేతిక నిపుణులు : 

రచయిత & దర్శకుడు : క్రాంతి మాధవ్ 

సమర్పణ : కేఎస్ రామా రావు 

నిర్మాత: కె.ఎ. వల్లభ 

బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్

సంగీతం: గోపి సుందర్ 

డిఓపి : జే కే 

ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్ 

PRO: వంశీ-శేఖర్