శర్వానంద్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్

Published on Jan 29,2019 12:52 PM

యంగ్ హీరో శర్వానంద్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాడు , నటించాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు మంచి అవకాశం ఇస్తున్నాడు శర్వానంద్ . తమిళంలో సంచలన విజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు . శర్వానంద్ - సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ శర్వానంద్ కోసం ఆ చిత్ర టీమ్ అన్వేషిస్తోంది . 14 ఏళ్ల వయసు నుండి 20 ఏళ్ల వయసు గల యువకుల కోసం అందునా శర్వానంద్ పోలికలతో ఉన్నవాళ్లకు ఈ గోల్డెన్ ఛాన్స్ లభించనుంది . 

తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించగా ఇక్కడ శర్వానంద్ - సమంత నటిస్తున్నారు . దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు . శర్వానంద్ లా ఉంటామని భావించే 14 ఏళ్ల వయసు నుండి 20 ఏళ్ల వరకు ఉన్నవాళ్లు వెంటనే మీ బయోడేటా ని పంపించండి గోల్డెన్ చాన్స్ కొట్టేయండి .