హీరో సిద్దార్థ్ పై కేసు నమోదు

Published on Dec 22,2019 09:12 AM
తమిళ హీరో సిద్దార్థ్ పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ హీరో చేసిన నేరం ఏంటయ్యా అంటే పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నిలవడమే ! చెన్నై లో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు హీరో సిద్దార్థ్ దాంతో కేసు నమోదు చేసారు చెన్నై పోలీసులు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ బిల్లు పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి విపక్షాలు అలాగే ముస్లిం సంఘాలు. ఆ బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు స్టూడెంట్స్ సైతం.

దాంతో చెన్నై యూనివర్సిటీ లో జరిగే ఆందోళనకు మద్దతుగా హీరో సిద్దార్థ్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాడు దాంతో ఈ కేసు నమోదు అయ్యింది. సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల కాస్త ఎక్కువగానే స్పందిస్తుంటాడు హీరో సిద్దార్థ్. గతకొంత కాలంగా ఈ హీరోకు సరైన సక్సెస్ లు లేకుండాపోయాయి పాపం దాంతో రేసులో లేకుండాపోయాడు ఈ హీరో.