యాంకర్ ప్రదీప్ పై కేసు

Published on Feb 02,2020 02:25 PM

యాంకర్ ప్రదీప్ పై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ జిల్లా కీసర కు చెందిన ఓ యువ దర్శకుడు యాంకర్ ప్రదీప్ పై కేసు పెట్టడంతో బంజారాహిల్స్ పోలీసులు ఆ ఫిర్యాదుని స్వీకరించి కేసు నమోదు చేసారు. ఇంతకీ ప్రదీప్ పై యువ దర్శకుడు పెట్టిన కేసు ఏంటో తెలుసా ? సినిమాల్లో నటించే అర్హత లేదని. ఎందుకంటే గతంలో యాంకర్ ప్రదీప్ ఓ అమ్మాయిని వేధించాడట. ఆ కేసులో రెండు రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడట ప్రదీప్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రూల్స్ ప్రకారం జైలు శిక్ష పడిన వాళ్ళు సినిమాల్లో నటించొద్దట.

కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దాంతో ఆ సినిమా షూటింగ్ తక్షణమే ఆపేయాలని అలాగే ఆ చిత్ర దర్శకుడిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కీసర కు చెందిన శ్రీరామోజు సునిషిత్. ఇతగాడు చెప్పిన సెక్షన్ లు విని షాక్ అయ్యారట పోలీసులు. అయితే కేసు అయితే నమోదు అయ్యింది కానీ షూటింగ్ ఆపడం కుదురుతుందా ? అన్నది అనుమానమే !